ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం వద్ద ఖమ్మం–వరంగల్ ప్రధాన రహదారిపై మంగళవారం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ వైపు నుంచి ఖమ్మం దిశగా వస్తున్న లారీ, ఖమ్మం నుంచి గొల్లగూడెం వైపు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. మధుకాన్ గ్రానైట్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుని వివరాలు, ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్