సంజీవరెడ్డి భవన్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఖమ్మంలోని సంజీవరెడ్డి భవన్‌లో జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కిలారి అనిల్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు బమ్మిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి, సమానత్వం కోసం గాంధీజీ చేసిన కృషిని స్మరించుకున్నారు. ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕