ఖమ్మం జిల్లా ఉపాధి అధికారి శ్రీరామ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈనెల 3న ఖమ్మం నగరంలోని వరుణ్ మోటార్స్‌లో 133 ఉద్యోగ ఖాళీల భర్తీకి జాబ్ మేళా నిర్వహించబడుతుంది. 10వ తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ, బీటెక్ అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ మేళాలో పాల్గొనవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఖమ్మం ఇల్లందు రోడ్డులోని వరుణ్ మోటార్స్‌లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.