ఖమ్మం: 9వ డివిజన్ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి

ఖమ్మం 9వ డివిజన్ కార్పొరేటర్ షేక్ నాగుల్ మీరా మంగళవారం నగరంలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు తుమ్మల యుగేందర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. 9వ డివిజన్లో సైడ్ డ్రైన్లు, సిసి రోడ్లు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, డివిజన్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు దొడ్డ ప్రవీణ్, నిఖిల్, రవి, రమణ, ఉపేంద్ర చారి, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్