జలాశయాల్లో నాణ్యమైన చేపపిల్లలు విడుదల చేసేలా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖల మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇప్పటికే ఆలస్యమైనందున ఈనెల 20వ తేదీనాటికి లక్ష్యం మేర నీటి వనరుల్లో చేప పిల్లల విడుదల చేయాలని తెలిపారు. అలాగే, టీ-మత్స్య యాప్ లో చేప పిల్లలు, సరఫరాదారులు, రవాణా చేసే వాహనం వివరాలను పొందుపర్చాలని చెప్పారు. వీసీలో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు.