ఖమ్మం: మద్యం తాగి వాహనాలు నడపొద్దు

ఖమ్మం: శనివారం, ఆదివారం ఖమ్మం ముస్తఫానగర్, కాల్వొడ్డు, ఖానాపురం ప్రాంతాల్లో ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ రెండు రోజుల్లో 61 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. అక్టోబర్ నెలలో మొత్తం 466 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 128 రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ మోడీఫైడ్ సైలెన్సర్లను మార్చినట్లు గుర్తించారు. ప్రజలు మద్యం సేవించి, బుల్లెట్ సైలెన్సర్ మార్చి, నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలను నడపొద్దని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్