ఖమ్మం: ఐదుగురికి డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు

ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ పోలీస్ కమిషనరేట్ ఎదురుగా రోడ్డు వెడల్పులో భాగంగా ఇల్లు కోల్పోయిన ఐదుగురి కుటుంబానికి అల్లిపురం వద్ద ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించారు. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు గురువారం కేఎంసీ కార్యాలయంలో మేయర్ పునుకొల్లు నీరజ చేతుల మీదుగా లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా, కార్పొరేటర్ కమర్తపు మురళీ ఉన్నారు.

సంబంధిత పోస్ట్