ఖమ్మం: రద్దు చేసే వరకూ పోరాటం

వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేసే వరకూ పోరాటం ఆగదని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు తెలిపారు. మంగళవారం రఘునాథపాలెం మండలం వి. వెంకటాయపాలెంలో జరిగిన మహాసభలో మాట్లాడారు. దేశంలో 50 శాతానికి పైగా ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పేర్కోన్నారు.

సంబంధిత పోస్ట్