ఖమ్మం: అర్హులకు ఇళ్లు, రుణాలివ్వాలి

అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాస రుణాలివ్వాలని, సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నందిపాటి మనోహర్ శనివారం డిమాండ్ చేశారు. ఖమ్మం మంచికంటి ఫంక్షన్ హాల్లో జరిగిన జిల్లా స్థాయి సామాజిక శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ కమిటీలు అర్హులకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు కేటాయించి నిజమైన పేదలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్