ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య సేవలను మెరుగుపరిచేందుకు మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా, శనివారం పారిశుద్ధ్య విభాగానికి చెందిన అన్ని వాహనాలకు ఫ్యూయల్ సెన్సార్లను అమర్చారు. ఇంధన వినియోగంపై కచ్చితమైన పర్యవేక్షణ, పారదర్శకతను పెంచడం, వాహనాల నిర్వహణలో సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ కార్యక్రమ లక్ష్యాలని కమిషనర్ తెలిపారు.