తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సంయుక్తంగా బుధవారం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం సమర్పించాయి. గ్రామాల్లో యూరియా సరఫరాను రైతులకు సాగు విస్తీర్ణం ఆధారంగా కూపన్లు జారీ చేసి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొండ్డపాటి రమేష్లతో పాటు మాదినేని రమేష్, ఎస్కె. మీరా సాహెబ్, ఇతర రైతులు పాల్గొన్నారు.