అన్ని రంగాల్లో అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం శ్రమించే కార్మిక లోకానికి ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల త్యాగాలు అమూల్యమైనవని ఆయన అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను, ఆదర్శవంతమైన పారిశ్రామిక విధానాలను అమలు చేసిందని ఆయన గుర్తు చేశారు.