మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఆరు నెలల వేతనాలు, నిర్వహణ బిల్లులు, పది నెలల కోడిగుడ్ల బిల్లులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు పిన్నింటి రమ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మంలో శనివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కార్మికుల బకాయిలు చెల్లించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో యునియన్ నాయకులు రాణి, సుగుణ, ఉపేంద్ర, ప్రమీల, పద్మ తదితరులు పాల్గొన్నారు.