ఖమ్మం: శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం

ఖమ్మం నగరంలోని రాపర్తినగర్ సబ్ స్టేషన్ ఎంవీ నగర్, టీఎన్జీవోస్ కాలనీ ఫీడర్ల పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని టౌన్-1 ఏడీఈ నాగార్జున ఒక ప్రకటనలో తెలిపారు. టీఎన్జీవోస్ కాలనీ, ఎంవీ నగర్ ఫీడర్ల పరిధిలోని విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్