ఖమ్మం: ఉపాధి హామీ చట్టసవరణలపై 20న నిరసనలు

ఖమ్మంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో గ్రామీణ పేదల కోసం రూపొందించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తోందని విమర్శించారు. గాంధీ పేరును తొలగించడమే కాక, చట్టసవరణతో పథకాన్ని పేదలకు దూరం చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, 20న జిల్లా వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద నిరసన దీక్షలు చేపట్టాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్