ఖమ్మం నగరంలోని నెహ్రూనగర్ లో నివాసముంటున్న రిటైర్డు ఉత్తమ గణిత అధ్యాపకుడు బీ. వీ. రామారావు (85) శనివారం మృతి చెందారు. ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేసిన ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు పరిశ పుల్లయ్య, ప్రధాన కార్యదర్శి రాయల రవికుమార్, నాయకులు మనోహర్రాజు, బుచ్చయ్య, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. సుబ్బయ్య, తాళ్లూరు వేణు తదితరులు ఆయనకు నివాళులర్పించారు.