ఖమ్మం: 12న స్తంభాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం

ఖమ్మం శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి (గుట్ట) సన్నిధిలో ఈ నెల 12న గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. సోమవారం సాయంత్రం 5:30 గంటలకు మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఈ ప్రదక్షిణ జరగనుంది. నృసింహ నామ స్మరణ, కీర్తనలతో సాగే ఈ కార్యక్రమంలో అనంతరం 6:30 గంటలకు కొండపై ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్