ఖమ్మం: నకిలీ విత్తనాలపై పటిష్ట నిఘా

పంట సాగులో విత్తనాల ప్రాముఖ్యతను గుర్తించి, నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు డీఏవో పుల్లయ్య తెలిపారు. జిల్లాలోని 21 మండలాల్లో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని, మోసాలకు పాల్పడే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రైతులు లైసెన్స్డ్ డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేసి, పంట కాలం పూర్తయ్యే వరకు రశీదులను భద్రపర్చుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్