ఖమ్మం: ఉమ్మడి జిల్లాలో మూడు పార్క్స్ అభివృద్ధి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం, పార్క్స్ అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ సునీత, పీసీసీఎఫ్ సువర్ణతో హైదరాబాద్లో సమావేశమైన ఆయన పలు సూచనలు చేశారు. ఇప్పటికే ఎల్డబ్ల్యూఈ నిధులతో అటవీ ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి అనుమతి జారీ చేయాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను కోరినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్