ప్రభుత్వ పాఠశాలలు చదివిన విద్యార్థికి ఎంబిబిఎస్ సీటు

ఖమ్మం జిల్లా, చింతకాని మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన గోదా శ్రావ్య, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని MBBS సీటు సాధించింది. చిన్నప్పటినుండి చదువులో ముందుండే శ్రావ్య, ప్రభుత్వ పాఠశాల నుంచి MBBS వరకు కష్టపడి చదివి విజయం సాధించడంతో గ్రామ సర్పంచ్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు ఆమెను సోమవారం సన్మానించారు. ఈ సంఘటన ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని నిరూపించింది.

సంబంధిత పోస్ట్

✕
✕