ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపటి పర్యటన కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు అయినట్లు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇంఛార్జి తుంబురు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాదులో ఆదివారం కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో పర్యటనను వాయిదా వేయడం జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.