నర్సింగ్ విద్యార్థిని హరిణి హత్యపై సమగ్ర విచారణకు NFIW డిమాండ్

ఖమ్మం జిల్లా, జూలూరుపాడులో నర్సింగ్ విద్యార్థిని హరిణి హత్యపై సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని బుధవారం NFIW జిల్లా కార్యదర్శి ఏపూరి లతాదేవి డిమాండ్ చేశారు. హరిణి కుటుంబాన్ని NFIW ఆధ్వర్యంలో పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా హత్యకు దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మహిళలు, విద్యార్థినుల భద్రతకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో NFIW అధ్యక్షురాలు బత్తినేని నీరజ, మహిళా సంఘం నాయకులు పోటు కళావతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕