కడవెండి శ్రీనివాస్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

మూడు దశాబ్దాలకు పైగా నిస్వార్థంగా సమాజ సేవ చేస్తూ, ప్రజా సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న ఖమ్మం జిల్లాకు చెందిన  కడవెండి శ్రీనివాస్‌కు ప్రతిష్టాత్మక నరేంద్ర మోడీ నేషనల్ ఇన్స్పిరేషన్ అవార్డు దక్కింది. నోయిడాకు చెందిన NMI ఫౌండేషన్ ఆయన సేవలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. VCI ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా, VN Diamond KCGF శ్రేయోభిలాషిగా సేవా కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు కొదుమూరి జగన్నాథం, కడవెండి విశ్వనాథం తదితరులు శ్రీనివాస్‌ను అభినందించారు. మూడు దశాబ్దాల సేవకు జాతీయ స్థాయి గుర్తింపు లభించడం అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕