బుధవారం తెల్లవారుజామున సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. గృహప్రవేశ వేడుక కోసం చంద్రుగొండ నుంచి సత్తుపల్లికి వస్తుండగా, కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని సత్తుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.