మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుర్రప్ప తండాలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల్లో భాగంగా విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై బానోత్ మహేందర్ అనే యువరైతు మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించగా, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. యువరైతు మృతితో గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది, పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.