ఖమ్మం జిల్లాకు వెదర్ వార్నింగ్

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ప్రజలు తీవ్రమైన చలితో ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. వాహనాలను నెమ్మదిగా నడపాలని సూచనలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్