ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ వైద్యులను సత్కరించింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో విశిష్ట సేవలకు గాను DCHS డా. రాజశేఖర్, పెనుబల్లి CHC డా. కిరణ్ కుమార్, డా. శివరామకృష్ణ, కల్లూరు CHC డా. రామ్‌శరణ్ పురస్కారాలు అందుకున్నారు. ఈ పురస్కారాలను మంత్రి దామోదర్ రాజనర్సింహ అందజేశారు.