పెద్దగోపతిలో ఘనంగా YSR వర్ధంతి

ఖమ్మం జిల్లా పెద్ద గోపతి గ్రామంలో వైయస్సార్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి వైఎస్సార్ అభిమానులు, గ్రామస్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ వడ్డే నారాయణరావు, మాజీ ఎంపీటీసీ తాళ్లూరి చిన్న పుల్లయ్య, వెంకటేశ్వరరెడ్డి, బండి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల ద్వారా వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయడమే నిజమైన నివాళి అని వక్తలు తెలిపారు.

సంబంధిత పోస్ట్