కొణిజర్ల: ఈతకు వెళ్లి బాలుడి మృతి

కొణిజర్ల మండలం చిన్నగోపతిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుకకు వచ్చిన అరవింద్ (13) అనే బాలుడు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. వైరా మండలం గొల్లపూడికి చెందిన అరవింద్, నాయనమ్మతో కలిసి బంధువుల పెళ్లికి వచ్చాడు. స్నేహితులతో కలిసి వ్యవసాయ బావి వద్ద ఈతకు వెళ్లగా, ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మరణించాడు. 7వ తరగతి పూర్తి చేసిన బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్