దమ్మపేట మండలం మందలపల్లి క్రాస్ రోడ్డు వద్ద దమ్మపేట పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా, ఎటువంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ఇసుక టిప్పర్‌ను పోలీసులు పట్టుకున్నారు. విచారణలో, డ్రైవర్ కొండ బాబు అరికిరేవు ఇసుక ర్యాంపులో ఇసుకను నింపుకొని గణేష్ పాడుకు తరలిస్తున్నట్లు తెలిపాడు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించినట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు.