భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని TGSWREIS పరిధిలోని 8 గురుకుల పాఠశాలలు, ఒక డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, PGT, TGT, లైబ్రేరియన్, ఆర్ట్ & క్రాఫ్ట్, మ్యూజిక్, హెల్త్ సూపర్వైజర్ పోస్టులను పార్ట్‌టైమ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు జూలై 7 సాయంత్రం 3 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. జూలై 8న పాల్వంచ COEలో టీచింగ్ డెమోలు నిర్వహించబడతాయి.