మణుగూరు సహజ సంపదల పుట్టినిల్లు. బొగ్గు తో దేశానికి వెలుగు నిచ్చే ఈ ప్రాంతం, పర్యాటకంగా కూడా ఆకర్షిస్తోంది. కూనవరం పంచాయతీలోని రేగులగండి చెరువు పచ్చని కొండలు, అడవుల మధ్య అలరిస్తోంది. ఈ చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ చొరవ తీసుకున్నారు.