భద్రాద్రి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ కారుకు ప్రమాదం

సూర్యాపేట జిల్లా నార్కట్‌పల్లి ఫ్లైఓవర్‌పై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్‌ సాయంతో కారును పక్కకు తొలగించారు. అడిషనల్‌ కలెక్టర్‌ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్

✕
✕