చుంచుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పన అధికారి కె. శ్రీరామ్ ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని టాటా డ్రైవ్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో 100 పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 10గంటలకు జరిగే ముఖాముఖికి 18 నుంచి 30సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులన్నారు.