జూలూరుపాడులో పల్టీ కొట్టిన కారు

జూలూరుపాడులో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం వైపు నుంచి కొత్తగూడెం వెళ్తున్న ఓ కారు డివైడర్ ను ఢీకొని పల్టీ కొట్టిందని స్థానికులు చెప్పారు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో కారు నడుపుతున్న వ్యక్తికి ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. అతనికి స్వల్ప గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్