ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం(స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్(SIR)లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ తన ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేశారు. పి. ఎస్. నేo. 72కు చెందిన బూత్ లెవల్ అధికారి(BLO)కె. స్వర్ణలత ద్వారా కలెక్టర్ ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా భారతఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(SIR) ప్రక్రియలో భాగస్వాములు కావాలని చెప్పారు.