చుంచుపల్లి మండలం 3 ఇంక్లైన్ పంచాయతీ పరిధిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న బస్టాండ్ పక్కన కొన్ని రోజులుగా చనిపోయిన శునకం అలాగే ఉండి దుర్వాసన వ్యాపిస్తోంది. బాలింతలు, చిన్నపిల్లలతో పాటు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు, సిబ్బంది స్పందించి చనిపోయిన శునకాన్ని తొలగించి ఆ ప్రాంతంలో బ్లీచింగ్ చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.