అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి రూ. 25 వేల ఆర్థిక సహాయం అందజేత

పాల్వంచ మండలం కరకవాగు గ్రామానికి చెందిన MD. ముబీన్ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్ర నష్టం జరిగింది. విషయం తెలుసుకున్న శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ చైర్మన్ N. సురేష్ రెడ్డి బాధిత కుటుంబాన్ని వీడియో కాల్ ద్వారా పరామర్శించి, ఫౌండేషన్ తరఫున తక్షణ సహాయంగా ₹25, 000 అందజేశారు. భవిష్యత్తులోనూ అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕