భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్ప హెచ్చుతగ్గులతో సాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 20. 20 అడుగుల వరకు పెరిగిన ప్రవాహం క్రమంగా తగ్గుతూ అర్ధరాత్రి 1 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు 19. 70 అడుగుల వద్ద నిలిచింది. అనంతరం ఉదయం 5 గంటలకు స్వల్పంగా పెరిగి 19. 90 అడుగులకు చేరింది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి (43 అడుగులు) కంటే వరద చాలా దిగువనే ప్రవహిస్తోంది.