ఇల్లెందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంగా సుబ్బారావు (90) శనివారం అనారోగ్యంతో పెనుబల్లిలోని తన స్వగృహంలో మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో 1972-78 మధ్య కాంగ్రెస్ తరఫున ఇల్లెందు ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. ఆ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి కోటేశ్వరరావుపై 11,826 ఓట్ల తేడాతో విజయం సాధించారు.