జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వెళుతున్న కారు, కొత్తగూడెం వైపు నుంచి పడమటి నరసాపురం వెళుతున్న ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.