మద్యం తాగి వాహనాలు నడిపిన కేసుల్లో 117 మందికి జరిమానా విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు గురువారం తీర్పు చెప్పారు. కొత్తగూడెం వన్ టౌన్ పరిధిలో 24 మంది, ట్రాఫిక్ స్టేషన్ పరిధిలో 13 మంది, టూటౌన్ పరిధిలో 30 మంది, సుజాతనగర్ పరిధిలో 10 మంది, చండ్రుగొండ పరిధిలో 10మంది, ములకలపల్లి స్టేషన్ పరిధిలో 30 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు.