సింగరేణిలో ఇప్పటివరకు బయోమెట్రిక్ విధానం ద్వారా ఉద్యోగులు తమ హాజరును నమోదు చేసుకునేవారు. శుక్రవారం నుంచి ముఖ గుర్తింపు ద్వారా హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ మేరకు యాజమాన్యం అన్ని ఏరియాల అధికారులను ఆదేశించింది. ఆగస్టు 1 నుంచి గనులు, కార్యాలయాల్లోకి ఉద్యోగులు రావడాన్ని, తిరిగి వెళ్లడాన్ని ఈ యంత్రం ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రధాన కార్యాలయం, ఏరియా జీఎం కార్యాలయాలు, గనులు, డిపార్ట్‌మెంట్ల వద్ద ముఖగుర్తింపు యంత్రాల బిగింపు ప్రక్రియ పూర్తికాగా కొన్ని ప్రాంతాల్లో తుది దశకు చేరింది.