పాల్వంచ నవభారత్ ప్రాంతంలో హోలీ పండుగ రోజున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉద్యోగి ఉమామహేశ్వరరావు మృతి చెందారు. ఇద్దరు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరొక వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. తండ్రిని కోల్పోయిన ఇద్దరు చిన్నపిల్లల పరిస్థితి హృదయ విదారకంగా మారింది.