కొత్తగూడెం: రోడ్డు ప్రమాదంలో మహిళలకు గాయాలు

కొత్తగూడెం పట్టణంలో గురువారం సాయంత్రం పోస్ట్ ఆఫీస్ సెంటర్ సిగ్నల్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంపై ఉన్న మహిళలు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108 వాహనంలో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పట్టణంలో కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్