పాల్వంచ: ఆర్టిజన్ కాంతారావుకు స్వల్ప గాయాలు

కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సీతారాంపట్నం సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్ కాంతారావు గురువారం రాత్రి 230 కేవీ లైన్ బంపర్లు కలిపే సమయంలో ఇండక్షన్ వల్ల గాయపడ్డారు. వెంటనే అధికారులు, సిబ్బంది కలిసి అతన్ని కేటీపీఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం కాంతారావు పరిస్థితి నిలకడగా ఉందని ఎలాంటి ప్రమాదం లేదని యజమాన్యం తెలిపింది.

సంబంధిత పోస్ట్