భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టీటీడీ కల్యాణ మండపంలో పీఆర్టీయు- టీఎస్ సమావేశం శనివారం రసాభాసగా సాగింది. ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి సమక్షంలో ఇటీవల సస్పెండ్ అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీఆర్టీయు అధ్యక్ష కార్యదర్శులు తమ సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ముందు వేదికపై పడుకొని నిరసన వ్యక్తం చేసారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వివాదం సర్దుమనిగింది.