భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగ్గూడెం సమీపంలోని భోజ్యతండా వద్ద ముర్రేడు వాగులో నిర్మిస్తున్న చెక్ డ్యాం పనుల్లో అనేక ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వాగులోని ఇసుకనే వినియోగిస్తున్నారన్నారు. రాత్రిళ్లు అక్రమంగా ఇసుక తవ్వి లారీల్లో తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంగళవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.