మధిర: జూనియర్ కళాశాల నూతన భవనానికి 5 కోట్లు మంజూరు

మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరం శెట్టి కిషోర్ ఆధ్వర్యంలో శనివారం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో గల శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనం కోసం రూ. 5 కోట్లు మంజూరు చేసినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్