మధిర మున్సిపాలిటీలో టీడీపీ మద్దతు కోరిన బీజేపీ

బుధవారం మధిరలో టీడీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాదంను బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు అందించి కలిసి పనిచేయాలని ఆయన కోరారు. బీజేపీ-టీడీపీ మధ్య ఉన్న బలమైన రాజకీయ అనుబంధాన్ని గుర్తుచేస్తూ మద్దతు కోరగా, దీనిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు సానుకూలంగా స్పందించినట్లు వాసుదేవరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్